![]() |
![]() |
.webp)
సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి డెవిల్ టీమ్ స్టేజి మీదకు వచ్చింది. హీరో నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్తా మీనన్, మరో నటుడు షఫీ, స్టోరీ రైటర్ శ్రీకాంత్ విస్సా వచ్చారు. బింబిసారా మూవీలో సాంగ్ ప్లే చేసేసరికి సంయుక్త డాన్స్ వేసింది.
ఐతే సుమ కళ్యాణ్ రామ్ ని డాన్స్ వేయమని అడిగేసరికి ఆ సాంగ్ లో తాను డాన్స్ వేయలేదని జస్ట్ నడుచుకుంటూ వెళ్లానని చెప్పారు. ఇప్పుడు చేయకపోయినా ఈ ఎపిసోడ్ లో ఎలాగైనా సరే డాన్స్ చేయించేస్తాం అని సుమ అనేసరికి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి..ఇలా ఉన్నా డాన్స్ చేయిస్తారా అనేసరికి స్టెప్ వద్దు అంటూ సుమ సర్దుకుపోయింది. ఇక వెంటనే కళ్యాణ్ రామ్ ఐతే ఓకే కాలు సెట్ ఐపోయింది అంటూ కామెడీ చేశారు. ఇక సుమ సీనియర్ ఎన్టీఆర్ మూవీలోని "ఆకు చాటు పిందె" సాంగ్ కి సంయుక్తతో కలిసి డాన్స్ వేసి ఎంటర్టైన్ చేసింది. షఫీ మధ్యలో వచ్చి సుమని అమ్మా అని పిలిచేసరికి "హలో ఎవరు మీరు మా చెలికత్తె వైపు చూస్తున్నారు చూస్తే గీస్తే నేను చూడాలి" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత కళ్యాణ్ రామ్ తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని చెప్పారు.. "ఫస్ట్ టు ఫిలిమ్స్ ప్లాప్ అయ్యాయి. దాంతో కొంచెం బాధగా అనిపించింది. చాలామంది కూడా నన్ను నిరుత్సాహ పరిచారు...ఎందుకు నీకు యాక్టింగ్ అవసరమా వెళ్ళిపో అన్నారు. ఐతే మా నాన్న మాత్రం ఎప్పుడూ నన్ను ఏమీ అనేవారు కాదు. అస్సలు బాధపడొద్దు..నేను ఏది అనిపిస్తే అది చేసుకో..నేను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించడానికి కారణమే ఆయన" అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యారు కళ్యాణ్ రామ్. ఇలా తన జీవితంలో ఎదుర్కున్న కొన్ని సంఘటనలు వివరించారు.
![]() |
![]() |